టాప్ నాలుగు దేశాలలో కనికరం లేని కరోనా..పెరగడమే!

Spread the love

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాసిటీవ్ కేసువ సంఖ్య రోజురోజుకు పెరగడమే కాని తగ్గే పరిస్తితి కనిపించటం లేదు. నిన్న రాత్రి వరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 12,841,261 కేసులు నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే 2,14,741 కేసులు కాగా మొన్న 2,36,918 కేసులు రికార్డయ్యాయి. సగటున రోజుకు 2 లక్షలకి పైగానే నమోదుకావటం ఆందోళన కలిగించే విషయము.

అగ్రరాజ్యం అమెరికాలో రోజు రోజుకు పరిస్థితి పుార్తిగా దిగజారిపోతుంది.రెండురోజుల క్రితం దాదాపు 72 వేల కేసులు నమోదు కావటం నిన్న 62 వేల కేసులు నమోదు కావటం ఆ దేశాన్ని కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. నిన్న రాత్రి వరకు మొత్తం 33,55,646 పాసిటీవ్ కేసులు కాగా నిన్న 61,719 మొన్న 71,787 కేసుల చొప్పున నమోదయ్యాయి. సగటున రోజుకు 60 వేలకు పైగానే కేసులు నమోదు కావటం జరుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల విషయంలో రెండో స్థానం లో కల దేశం బ్రెజిల్ నందు సగటున 40 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.బ్రెజిల్ నందు నిన్నటి వరకు మొత్తం 18,40,812 కేసులు నమోదు కాగా నిన్న ఒక్క రోజే 36,474, మొన్న 45,235 కేసులు నమోదు కావటం జరిగింది.

కరోనా మహమ్మారి బారిన పడిన దేశాలలో ముాడో అత్యదిక కేసులు కలది మన దేశం.గత ముాడు రోజులుగా 27 వేల చొప్పున సగటున కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న రాత్రి వరకు దేశంలో మొత్తం 8,50,358 కేసులు నమోదు కాగా నిన్న 27,755 కేసులు మొన్న 27,761 కేసులు నమోదు కావటం జరిగింది. చాలా రాష్ట్రాల యందు గరిష్ఠ నమోదులు జరుగుతున్నాయి. సగటున రోజుకు 30 వేలకు పైగా చేరి 40 వేల సగటున కుాడా నమోదయ్యే అవకాశం వుంది.

మొత్తం కరోనా పాసిటీవ్ కేసులు యందు ప్రపంచం లో 4వ స్థానం లో కల దేశం రష్యా. రష్యా నందు గత నెల రోజుల నుండి స్థిరంగా 6 నుండి 7 వేల మద్యలోనే పాసిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. టాప్ కరోనా దేశాల యందు స్థిరంగా పెరగకుండా తగ్గకుండా కేసులు కల దేశం రష్యా మాత్రమే. రష్యాలో నిన్న రాత్రి వరకు వరకు మొత్తం 7,20,547 కేసులు నమోదు కాగా నిన్న 6,611 కేసులు, మొన్న 6,635 కేసులు నమోదు అయ్యాయి.

ఒక్క రష్యా మినహ మిగలిన మూడు దేశాలలో తీవ్ర ఆందోళనకరమైన అంశమే.భారీ మూల్యం తప్పేలా లేదు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *