ఆమె మాట వినండి ఆమెతో నడవండి కానీ ఆమెపై తీర్పులివ్వకండి…

Spread the love

#ఆమె_ఒక_అద్భుతం

ఆమె మాట వినండి
ఆమెతో నడవండి
కానీ ఆమెపై తీర్పులివ్వకండి

ప్రతి స్త్రీకి ఒక గతం ఉంది.
కొందరు శారీరకంగా వేధింపులకు గురయ్యారు.
కొందరికి హింసాత్మక తల్లిదండ్రులు ఉన్నారు.
కొందరికి యుక్తవయస్సు సమస్యలు ఉన్నాయి.
కొందరు తమ కుటుంబ సభ్యుల నుండే లైంగిక వేధింపులకు గురయ్యారు.
కొందరు ప్రేమకథలను గందరగోళపరిచారు.
కొందరు ప్రేమ పేరిట బలవంతంగా సెక్స్ లోకి లాగబడ్డారు.
కొందరు మత్తుపదార్థాలు తీసుకున్నారు.
కొందరు డేట్ రేప్ కు గురయ్యారు.
కొందరు దుర్మార్గంగా ఫోటోలు తీయబడ్డారు.
కొందరిని మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్ చేశాడు.
కొందరు దుర్వినియోగ సంబంధంలో ఉన్నారు.
కొందరికి రుతు సమస్యలు వచ్చాయి.
కొందరికి విఫల కుటుంబం ఉండేది.
కొందరు విడాకులు తీసుకున్నారు.
కొందరికి ఊబకాయం సమస్య ఉంది.
కొందరికి ఆర్థిక కరువు వచ్చింది.
కొందరు మాదకద్రవ్యాల పాలయ్యారు.
కొందరికి మద్యపాన వ్యసనం ఉంది.
కొన్ని విజయవంతం కాని ఆత్మహత్యాయత్నాలు జరిగాయి.

ఆ గతంతో ఆమెను కించపరచవద్దు.
ఆమెను మరింత దుర్వినియోగం చేయవద్దు.

ఒక స్త్రీని మీరు చూసినట్లయితే,
అప్పటికే ఆమె కన్నీళ్లను తుడిచిపెట్టి,
దుఖాలకు చిరునవ్వు ముసుగు వేసి,
బలంగా, సమున్నతంగా నిలబడి,
తన భవిష్యత్తు వైపు నడవడం ప్రారంభించింది.
ఎందుకంటే ఆమెకు ఇంకా కొంత ఆశ ఉంది.
ఆమె ఈ ప్రపంచంలో మిగిలి ఉన్న ప్రేమ భావనను వదలలేదు.

ఆమెకు మార్గం ఇవ్వండి.
ఆమె పక్కన తోడుగా నడవండి.
ఆమె చేతులు పట్టుకుని కాసేపు నడవండి.
ఆమె ఆత్మ ఎంత అందంగా ​​ఉందో,
ఆమె ఆశలు ఎంత బలంగా ఉన్నాయో మీకు తెలుస్తుంది!
ఆమె శక్తినంతా పీల్చేసినా
ఎలా ముందడుగు వేస్తుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు.

ఆమె ఎప్పుడూ పక్కింటి మహిళ మాత్రమే
కావాల్సిన అవసరం లేదు.
ఆమె మీ స్నేహితురాలు, మీ సోదరి, మీ భార్య కావచ్చు,
మీ తల్లి కూడా కావచ్చు.
ఆమె గతాన్ని బట్టి ఆమెపై తీర్పులివ్వవద్దు.
ఆమెకు అర్హమైన, ప్రశాంతమైన భవిష్యత్తును బహుమతిగా ఇవ్వండి.
ప్రపంచానికి వ్యతిరేకంగా ఆమె చేయి పట్టుకోండి.
ఆమె ఎప్పుడూ ఆరాటపడే ప్రేమను అందివ్వండి!

మహిళలు…
ప్రేమకు ప్రతిబింబాలు,
ప్రశాంతతా అభయారణ్యాలు.

మూలం:తెలియదు.
అనువాదం:
#PsyVisesh
#She….


Spread the love

3 Replies to “ఆమె మాట వినండి ఆమెతో నడవండి కానీ ఆమెపై తీర్పులివ్వకండి…”

  1. అందుకే భూమాత ను ఆడవారి తో పోల్చారు. భూమాత కు ఉన్నంత సహనం ఓర్పు ఆడవారికి ఉన్నందుకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *