లామా యాంటీ బాడీలతో కరోనాకు చెక్…!

Spread the love

లామా అనే జంతువు రక్తం నుంచి తీసిన యాంటీబాడీలు కోవిడ్ చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. లామా కేంద్రంగా వైద్య విజ్ఞాన రంగంలో ఎగ్జైట్‌మెంట్‌కు కారణం ఈ పరిశోధన ఫలితాలే. నేచర్ స్ట్రక్చరల్ అండ్ మాలిక్యులర్ బయోలజీ అనే ప్రఖ్యాత సైన్స్ జనరల్‌లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. లామా కూడా క్షీరదమే. అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జంతు సమూహం. ఒంటెలు, లామాలు ఒకే కుటుంబానికి చెందిన జంతువులు.
కోవిద్-19 వైరస్‌ను ఎదుర్కొనే దిశగా లామా రక్తంతో తయారయ్యే యాంటీ బాడీలు చాలా సరళమైన రసాయనిక నిర్మాణంలో ఉంటాయి. ఈ యాంటీ బాడీలను ఉపయోగించి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే దిశగా ఇంగ్లండ్‌లోని రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ శాస్తవేత్తలు పరిశోధన జరిపారు. లామా రక్తంలోని యాంటీ బాడీ నుంచి రూపొందించిన నానో బాడీస్ థెరఫి త్వరలోనే క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లనుంది. అంతా సవ్యంగా సాగితే ఈ థెరపి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు.


Spread the love

2 Replies to “లామా యాంటీ బాడీలతో కరోనాకు చెక్…!”

  1. గుడ్ ఈవినింగ్ సార్.. మంచి సమాచారం. లామా అనే పేరుతో ఒక జంతువు ఉందని ఇంతవరకు తెలియదు. తొందరలోనే కరోనాకు మందు రావాలని పేదవాడు కూడా బ్రతకాలి అని కోరుకుంటున్నాను.

  2. గుడ్ మార్నింగ్ సార్, మంచి సమాచారం సార్.. మానవుడు తనకు తాను ఉపయోగపడక పోయినా ప్రపంచానికి ఎక్కువగా తెలియని లామా అనే ఒక జంతువు ఉన్నది అని దాని ద్వారా బ్రతకటం సంతోషకర విషయం పోస్ట్ చాలా బాగుంది సార్, థాంక్యూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *