వీరు మేఘాలను తయారు చేస్తారు, ఉరుములు మెరుపులను కుాడా…ఇవి నిజంగా వర్షాన్ని కురిపిస్తాయట!

Spread the love

ప్ప్రాచీన గిరిజన సాంప్రదాయం..అద్భుతమయిన శాస్త్ర పరిజ్ఞానము

వీరే మేఘాలను సృస్టిస్తారు మరియు ఉరుములు మెరుపులను కూడా క్రియేట్ చేస్తారు తరువాత ఇంకేముంది వర్షం రావడమే తరువాయి…నిజమే వర్షం పడుతుంది.
వినటానికి లేదా చదవటానికి కొత్తగా అనిపించవచ్చు కాని వీరి సాంప్రదాయం వెనుక అద్భుతమైన సైన్సు దాగి వుంది.

మధ్యప్రదేశ్ రాజస్తాన్ చత్తీస్ గడ్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాచీన గిరిజన తేగల వారు వర్షాకాలము రాగానే వర్షాల కోసము ఎదురుచూస్తారు పదిహేను నుండి నెల రోజుల వరకు చుసిన తరువాత వర్షాలు పడక పోతే వీరందరు కలిసి మూడు రకాల చర్యలను చేపడతారు. పెద్ద పెద్ద వృక్షాల యొక్క పచ్చి కొమ్మలను చాల చోట్ల వుంచి మంట పెడతారు వాటి నుండి దట్టమయిన పొగ వస్తుంది దీని వలన ఆ ప్రాంతమంత పొగలతో నిండిపోయి పొగ అంత ఆకాశం వైపు వేల్లిపోతుంటుంది. వీరు ఆ పొగను పైకి వెళ్ళటం చూసి మేఘాలుగా మారినాయనుకుంటారు.
అదే సమయాన మరికొందరు అక్కడే సమీపంలో కల కొండలు గుట్టలు ఎక్కి పెద్ద పెద్ద బండలను పై నుండి ఒకదానిపై మరొకటి దోర్లిస్తుంటారు.దీని వలన బండల రాపిడితో భారి శబ్దం వస్తుంది అలాగే బండల రాపిడి వలన ఉష్ణము జనించి మెరుపులలాగా మెరుస్తుంటాయి. ఈ ప్రక్రియ వలన బండల శబ్దాలను ఉరుములు గాను అలాగే బండల్ రాపిడిలో వచ్చిన నిప్పురవ్వలను మెరుపులుగాను భావిస్తారు.
పచ్చికోమ్మల మంటల వలన వచ్చిన పోగలను మేఘాలుగా బండల వలన వచ్చిన చప్పుడు ఉరుములుగా మరియు బండల రాపిడిలో వచ్చిన మెరుపులను మెరుపులుగాను వీరు భావించి వీటిని మేము సృష్టించామనుకొని సంతోషంగా ఇళ్ళలోకి వెళ్ళిపోయి వర్షం కోసం ఎదురుచూస్తారు.

ఆశ్చర్యం…వీరు ఆ పనులు చేసిన కొద్ది సేపటికే వర్షంవపడుతుంది. ఇది చూసిన గిరిజన ప్రజలు సంతోషంగా నృత్యం చేస్తారు. తమ శ్రమ ఫలించిందని సంభరాలు చేసుకుంటారు.సాధారనంగా వర్షా కాలం సమయానికి అంతకుముందే సముద్రంలోని నీటి వలన ఏర్పడిన మేఘాలు ఆయ ప్రాంతాల ఆధారంగా భూమిపైన ఆవరణలో ఆవరించి వుంటాయి. మేఘాల చలనం అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు గమనంలో వుంటాయి. వాతావరణ మార్పుల కారణముగా కొన్ని ప్రాంతాల వైపు మేఘాల కదలిక వుండదు లేదా కొన్ని ప్రాంతాలలో అధిక లేదా సమాన పీడనము ఉండవచ్చు. అట్టి పరిస్థుతులలో ఆ ప్రాంతాల వైపు మేఘాల పయనం వుండదు. గిరిజనాలు ఏదయితే సాంప్రదాయం లేదా ఆచారం అని మనం పైన చెప్పుకున్నవిధంగా మూడు చర్యలు చేపడితే వర్షం పడుతుంది.
సైన్స్ ప్రకారం వివరణ ఏమిటనగా చెట్ల యొక్క పచ్చి కొమ్మలను చాలా చోట్ల భారీ మొత్తంలో మండించటం వలన ఆ ప్రాంతం చుట్టు మరియు పై ఆవరణలో ఊష్ణోగ్రతలలో మార్పులు కలుగుతాయి ఫలితంగా ఆ ప్రాంతం చుట్టు పక్కల అల్పపీడనం యేర్పడుతుంది. అదే విధంగా పెద్ద పెద్ద బండ రాళ్లను ఒక దానిపై మరొకటి దొర్లించటం వలన ఘర్షణ యేర్పడి రాపిడి కల్గించటం వలన జనించిన ఊష్ణం వలన కుాడా అక్కడి ప్రాంతంలో పీడనంలో మార్పు కల్గిస్తుంది.
పచ్చి చెట్ల కొమ్మలను మండించటం, బండలను దొర్లించటం వంటి చర్యల వలన ఆ ప్రాంతం చుట్టు మరియు పై ఆవరణలో ఊష్ణోగ్రతలలో మార్పులు జరిగి అల్ప పీడనం ఏర్పడుతుంది అదే సమయంలో మేఘాలు విస్తరించి వుండటం అవి అధిక పీడనం వైపు నుండి అల్ప పీడనం వైపు చలించే స్వభావమును కలిగివుండటం వలన మేఘాలు ఈ ప్రాంతాల వైపు రావటం వర్షం కురవటం జరుగుతుంది.

వేల సంవత్సరాల క్రితం గిరిజనులలో వర్షాల పైన శాస్త్రీయముగా అవగాహన వుండటం వలన వారు ఈ విధానాన్ని పాటించారు. కాల క్రమేణ ఈ ప్రక్రియ ఆచారంగా మారి అదే ఆనవాయితిని తదుపరి కొనసాగించారు.చాల సంవత్సరాల తరువాత శాస్త్రీయ విషయాల పై మనకు అవగాహన లేకపోవటం వలన వాటిని ముాఢ నమ్మకాలు అని ముాఢ ఆచారాలు అని తక్కువ చేయడం జరుగుతుంది.ఈ ప్రాంతాల యందు ప్రజలు దట్టమైన పొగలు పైకి వెల్లటాన్ని మేఘాలు తయారు చేశామని అలాగే పెద్ద పెద్ద బండరాయిల ఘర్షణ వలన వచ్చిన ధ్వనులను ఇడుములు గాను ఘర్షణ లో జనియించే ఉష్ణ శక్తిని మెరుపులు గాను భావించటం జరుగుతుంది.ఈ ఆచారాలు వ్యవహారాలు రానురాను కరుమరుగయి పోయాయి.
మన దేశంలో అన్ని సమాజాలలో, సముాహాలలో, జనాలు పాటించే ఆచారాలు సంప్రదాయాల వెనుక శాస్త్రీయ విషయాలు దాగి వున్నాయి. మనకు తెలియక లేదా అర్థం కాక వాటిని ముాఢ ఆచారాలు,ముాఢ నమ్మకాలు అని కొట్టి పారేయటం లేదా చిన్న చుాపు చుాడటం జరుగుతుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *