మాయా బ‌జార్ థీమ్‌తో రానా- మిహీక వెడ్డింగ్ ఇన్విటేష‌న్

Spread the love

టాలీవుడ్‌లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టులు ఇలా ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. జూలై 26న నితిన్ త‌న ప్రేయ‌సిని వివాహమాడ‌నుండ‌గా, ఆగస్టు 08 మధ్యాహ్నం 2 గంటలకు కాజాగూడ చైతన్య ఎన్‌క్లేవ్‌ (మణికొండ)- హైదరాబాద్ లో రానా- మిహీక‌ల వివాహం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జ‌రుగుతుండ‌గా, తాజాగా వెడ్డింగ్ ఇన్విటేష‌న్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

మాయాబజార్ చిత్రంలోని సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా పౌరాణిక థీమ్‌తో వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌ని రూపొందించ‌గా ఇందులో వ‌రుడు, వ‌ధువు పేర్లు, క‌ళ్యాణ వేదిక త‌దిత‌ర అంశాల‌ని చూపించారు. ఇది ఫ్యాన్ మేడ్ వీడియోగా చెబుతుండ‌గా, ద‌గ్గుబాటి ఫ్యామిలీని ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియోకి స్పందించిన రానా స్మైలింగ్ ఎమోజీస్ పోస్ట్ చేశారు. క‌రోనా వ‌ల‌న రానా వివాహం కొద్ది మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగు, మార్వాడీ సాంప్రదాయాలలో ఈ పెళ్లి తంతు నిర్వహించనున్నారట.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *