ఆగస్టులో థియేటర్స్ రీ ఓపెనింగ్.. ఐబి శాఖ సిఫారసు..

Spread the love

కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా థియేటర్స్ అన్నీ మూత పడ్డాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు థియేటర్స్ క్లోజ్ కావడంతో కోట్ల నష్టాలు కూడా వచ్చాయి. అయితే కరోనా సంక్షోభ సమయంలో థియేటర్స్ ఓపెన్ చేయడం మంచిది కాదని ఎవరూ మాట్లాడటం లేదు కూడా. మధ్యలో రెండు మూడు సార్లు థియేటర్స్ తెరిచే విషయంపై చర్చ జరిగినా కూడా ఇప్పటి వరకు అయితే అది కార్యరూపం దాల్చలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది సినిమా థియేటర్స్ అన్నీ మూత పడ్డాయి. వీటిని ఆగస్టు నెలలో పున: ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా సిఫారసు చేసింది.
కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఆగస్టులో థియేటర్స్ ఓపెన్ చేయాలని సూచనప్రాయంగా తెలిపింది. అయితే థియేటర్స్ పున: ప్రారంభంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని అమిత్ తెలిపారు. ఆగస్టు 1 లేదంటే మాత్రం 31న దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సినిమా థియేటర్స్ మొదలు పెట్టాలని సిఫారసు చేశామని కేంద్ర కార్యదర్శి వెల్లడించారు.

అయితే ఓపెన్ చేసినా కూడా కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా నియమాలు ఉంటాయని తెలిపారు. థియేటర్స్‌లో సీట్స్ మధ్య కచ్చితంగా గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీట్ సీట్ మధ్య కనీసం రెండు మీటర్ల దూరం పాటించేలా సినిమా హాళ్లు నడపాలని తాము యజమానులతో మాట్లాడతామన్నారు. కేంద్ర కార్యదర్శితో జరిగిన సమావేశంలో సోనీ సీఈవో సం బల్సారా, మెగా టాటా (డిస్కవరి) గౌరవ్ గంధి (అమెజాన్ ప్రైమ్), మనీష్ మహేశ్వరి (ట్విట్టర్), శివకుమార్, కె. మాధవన్ (స్టార్ అండ్ డిస్నీ) లు పాల్గొన్నారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *