కరోనాను జయించాడు కానీ… కుటుంబాన్ని జయించలేక తనువు చాలించాడు.

Spread the love

అతడి వయస్సు దాదాపు అరవై సంవత్సరాలు అందులో డయాలసిస్ పేషెంట్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డయాలసిస్ చేసుకుంటున్న క్రమంలో కరోనా అతడికి సోకింది. ఆర్ధిక పరిస్థితి బాగానే వుంది అయినా ఎక్కడ జాయిన్ కావాలో తేల్చుకోలేక ముందే గవర్నమెంట్ అంబులెన్సు వచ్చింది అతడిని గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. బాగానే డబ్బులు వున్నాయి కదా అని తన బంధువులు భార్య ఎవరయినా ప్రైవేటులో జాయిన్ చేస్తారని భావించాడు. గాంధీ లో రెండు రోజుల వరకు దవాఖానలో తనను ఎవరు పట్టించుకోవడం లేదని తన వారికి ఫోన్ లో భాదను వ్యక్తం చేశాడు. ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కానీ ప్రైవేటులో జాయిన్ చేయలేదు. ఇక్కడే కరోనాతో చనిపోతే కడసారి తనవారిని చూడకుండా చనిపోతే బాగుండదని గుండె ధైర్యంతో దవాఖాన సిబ్బందిని బతిమాలుకొని డయాలసిస్ చేయించుకుని కరోనా ట్రీట్మెంట్ పూర్తిచేసుకుని పది రోజుల తరువాత ఇంటికి చేరుకున్నాడు.

ఇంటికి వచ్చిన తరువాత అర్థమైంది తనవాళ్ల ప్రవర్తన వలన తాను ఎందుకు బతికానో అని. ఇంట్లోనే పరాయి ఫీలింగ్ వచ్చింది ఇంత ఆస్తి సంపాదించినా కానీ ఏమి లాభం. తన వారు తాను దవాఖానలో చనిపోతాడని భావించారు కానీ తానూ వచ్చే సరికి వారి మొఖంలో సంతోషం లేదు మనసుకు బాగా భాద అనిపించింది జీవితం మీద విరక్తి కలిగింది అంతే ఎవరికీ అనుమానం రాకుండా రోజు భోజనం చేయడం మానేసాడు. ఎవరయినా అడిగితే తినాలని లేదు అని తప్పించుకునే వాడు. అలా అయిదు రోజులపాటు ఇండైరెక్టుగా సల్లేఖన వ్రతము లాగ చేసి తనువు చాలించాడు. చనిపోవడానికి అరగంట ముందు కుటుంబ సభ్యులకు ఆస్థులవివరాలు వివరించాడు.

వయసులో పెద్దాయన , డయాలసిస్ పేషెంట్ ఒంటరిగా గాంధీ ఆసుపత్రి లో కరోనాను జయించి కూడా తన వారి చేత ఓడిపోయి తనువు చాలించాడు. మానవత్వం మరియు బంధుత్వం కూడా డబ్బుతోనే ముడివడి ఉంటుందా.!


Spread the love

3 Replies to “కరోనాను జయించాడు కానీ… కుటుంబాన్ని జయించలేక తనువు చాలించాడు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *