రోజు గోరువెచ్చని నీరు…కరోనా సమయంలో మేలు!

Spread the love

వేడి నీళ్లను తీసుకోవడం వలన రోగాలు దరిచేరవని నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని రోజు తీసుకోవడం వలన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం. కడుపునొప్పి, జీర్ణసంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అధికబరువు, ఊబకాయం నుంచి బయటపడాలంటే రోజు గోరువెచ్చని వేడినీళ్లు తాగాలి. కీళ్ల నొప్పులు ఉన్నవారు గోరువెచ్చని నీళ్లు తాగితే ఆర్థరైటిస్ నుంచి బయటపడొచ్చు. ఇక దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు గోరు వెచ్చని నీరు తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే గది ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ఉండే కరోనా వైరస్‌లో 90 శాతం వైరస్ 24 గంటల్లో చనిపోతుందని, 99.99 శాతం వైరస్ చనిపోయేందుకు 72 గంటల సమయం పడుతుందన్నారు.

అదే నీరు బాగా మరుగుతుంటే అందులో కరోనా వైరస్ బతికి ఉండదని, వెంటనే చనిపోతందని తెలిపారు. అందువల్ల నీటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా కరోనా వైరస్ జీవితకాలం ఉంటుందని తేల్చారు. అసలు తాజా నీరు, సముద్రపు జలాల్లో కరోనా వైరస్ ఎక్కువ సమయం పాటు జీవించి ఉండలేదని, అది ఆయా ప్రాంతాల్లో వృద్ధి చెందలేదని కూడా సైంటిస్టులు తేల్చారు. ఇక స్టెయిన్‌లెస్ స్టీల్‌, లినోలియం గ్లాస్, ప్లాస్టిక్‌, సెరామిక్ ఉపరితలాలపై కరోనా వైరస్ 48 గంటల పాటు ఉంటుందని తేల్చారు.

అయితే ఇండ్లలో వాడే చాలా వరకు హౌస్‌హోల్డ్ డిసిన్ఫెక్టెంట్లు కరోనా వైరస్‌ను చంపుతాయని, అదే 30 శాతం ఈథైల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ గాఢత ఉన్న ద్రావణాలైతే కొన్ని లక్షల ఇతర వైరస్ కణాలను అర నిమిషంలోనే చంపుతాయన్నారు. అదే 60 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ గాఢత ఉన్న ద్రావణాలు అయితే కరోనా వైరస్‌ను క్షణాల్లోనే చంపుతాయన్నారు. క్లోరిన్ ద్రావణాన్ని పిచికారీ చేసినా కేవలం 30 సెకన్లలోనే ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్ నశిస్తుందని అన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *