వంటి పై చీరలను తాడులా చుట్టి ఇద్దరి ప్రాణాలు కాపాడిన మహిళలు… కాదు మాతృ మూర్తులు.

Spread the love

వూహించని విధంగా ముగ్గురు మ‌హిళ‌లు యువ‌కుల ప్రాణాలు కాపాడి వారి పాలిట‌ దేవ‌త‌లుగా నిలిచారు. నీళ్ల‌లో కొట్టుకుపోతున్న‌ యువ‌కుల‌ను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీర‌ల‌ను అందించి అమ్మ‌గా మారి వారికి పున‌ర్జ‌న్మ ఇచ్చారు. త‌మిళ‌నాడులో ఆగ‌స్టు 6న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా పెరంబ‌ళూర్ జిల్లాలోని కొట్టారై డ్యామ్ నీటి మ‌ట్టం పెరిగింది. శిరువాచూర్ గ్రామానికి చెందిన 12 మంది యువ‌కులు ఆ డ్యామ్‌కు స‌మీపంలోనే క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లారు.అనంత‌రం వారు ఆ డ్యామ్‌లో స్నానాలు చేసేందుకు వెళ్ల‌గా అక్క‌డున్న ముగ్గురు మ‌హిళ‌లు వారిని హెచ్చ‌రించారు. ఇంత‌లో న‌లుగురు కుర్రాళ్లు ప్ర‌మాద‌వ‌శాత్తూ డ్యామ్‌లో ప‌డిపోయారు. దీంతో వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించ‌గా అక్క‌డ తాడు వంటివి క‌నిపించ‌లేదు. మ‌రోవైపు వాళ్లు నీళ్ల‌లో మునిగిపోతుండ‌టంతో ఇక క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా మ‌హిళ‌లు వారి ఒంటిపై ఉన్న చీర‌ల‌ను తీసి డ్యామ్‌లో ఉన్న కుర్రాళ్ల‌కు అందేలా చేశారు. దీంతో ఇద్ద‌రి కుర్రాళ్ల ప్రాణాలు కాపాడ‌గలిగారు. కానీ దుర‌దృష్టం వ‌ల్ల మ‌రో ఇద్దరు జ‌ల‌స‌మాధి అయ్యారు. ఆడవారిని హీనంగా చూసే రోజులలో కూడా మహిళలు పురుషుల ప్రాణాలు కాపాడటానికి వంటి పైన చీరలను విప్పి వారి ప్రాణాలను కాపాడటం వంటి సంఘటనలు పురుష జాతికి కనువిప్పు కలిగించాలి.


Spread the love

4 Replies to “వంటి పై చీరలను తాడులా చుట్టి ఇద్దరి ప్రాణాలు కాపాడిన మహిళలు… కాదు మాతృ మూర్తులు.”

  1. Good morning sir, Great news sir.. not only great it is a guide to prevent such incidents while happen .. god give good health to them bless to their families..
    They look like poor back ground but the rich society treated such people as simply, but they are Goddess …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *