ఎక్కువ మందికి కరోనా సోకితే…మంచిదేనట!

Spread the love

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ కరోనా భారిన పడగా, కోటి నలభైలక్షల మంది రికవరీ అయ్యారు. ఇక 7,73,000 మంది ఈ మహమ్మారితో పోరాడి మృతి చెందారు. అయితే మునుపటి కంటే ఇప్పుడు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఇదివరకటి కంటే వేగంగా ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ స్ట్రెయిన్ ఓ శుభవార్తగా పరిగణించొచ్చని వారు భావిస్తున్నారు. అయితే ఎవ్వరికీ ప్రాణాపాయం కలగకుండా వీలైనంత మందికి సోకడం వైరస్ కే మంచిదేనని.. ఎందుకంటే.. తన ఉనికి కోసం వైరస్ రోగిపై ఆధారపడకతప్పదు అని సింగపూర్ కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు పాల్ తంబాయా వ్యాఖ్యానించారు. ఇక అధికంగా వైరస్ పరిణామం చెందే కొద్ది వ్యాధి తీవ్రత తగ్గిపోతుందని ఆయన తెలియచేసారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *