రూపాయి రూపాయి బిచ్చం అడుక్కుని…కరోనా నిధికి లక్ష దానం చేసిన యాచకుడు!

Spread the love

ఒక యాచ‌కుడు చేసే ప‌ని రోజు యాచించ‌డ‌మే, వ‌చ్చిన దానిలో రూపాయి, రూపాయి దాచిపెట్టుకునేవాడు, క‌రోనా వ‌ల్ల ఎన్నో జీవితాలు నాశ‌నం అవుతున్నాయ‌ని గ‌మ‌నించి త‌న ద‌గ్గ‌ర దాచుకున్నవి, త‌న వంతుగా ల‌క్ష‌రూపాయ‌లు క‌రోనా నిధికి దానం చేసి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. సమాజం పట్ల అతడి ఔదర్యాన్ని ప్రశంసించిన కలెక్టర్ సామాజిక కార్యకర్త అన్న బిరుదుతో సత్కరించారు. మదురై‌కు చెందిన పూల్‌పాండియన్ అనే వ్యక్తి యాచిస్తూ జీవిస్తున్నాడు. కరోనా మహమ్మారితో పలువురు మరణించడాన్ని చూసి అతడు చలించిపోయాడు. దీంతో తన వంతు సహాయంగా మే నెలలో రూ. పది వేల విరాళం ఇచ్చాడు. గత మూడు నెలల్లో భిక్షాటన ద్వారా రూ.90 వేలు సేకరించాడు. మంగళవారం మదురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆ డబ్బును కరోనా నిధికి విరాళంగా ఇచ్చాడు. కరోనా కట్టడికోసం పూల్‌పాండియన్ బాధ్యతను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్ ఆయనను సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ ఒక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. దీంతో పాండియన్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశాడు. జిల్లా కలెక్టర్ తనకు సామాజిక కార్యకర్త అన్న బిరుదు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పాడు. డమ్మీ సినిమా హీరోలు, మన గ్రేట్ కిర్కేట్ ఆటోగాల్లు ఇతడిని చూసి నేర్చుకోండి ఎలా దానం చేయాలో…


Spread the love

2 Replies to “రూపాయి రూపాయి బిచ్చం అడుక్కుని…కరోనా నిధికి లక్ష దానం చేసిన యాచకుడు!”

  1. Wow Great Humanity..Nowadays People Rasing Funds In the name of something something and looting public money but the begger shown shows his humanity and gratitude towards society is priceless ..Live Long Man , God bless you always good health and immense of joy ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *