దేశ ప్రజలందరికి ఉచితంగా కరోనా వాక్సిన్…

Spread the love

ఆస్ట్రేలియా దేశంలో ప్రజలందరికి కరోనా వాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ఆ దేశ ప్రధాని తెలిపారు. దీని కోసం ఆస్ట్రాజెనికా అనే కంపెనీ తో ఒప్పందం చేసుకున్నామని ప్రధాన మంత్రి స్కాట్ మోరీసన్ తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి వాక్సిన్ తయారీలో పాలుపంచుకుంటుంది. ఈ యూనివెర్సిటీకి సంబంధించి పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని తెలుస్తుంది. ఒక వేళా సక్సెస్ అయితే దేశంలోని ప్రజలందరు వుచితంగా లబ్ది పొందుతారు. ఇందుకోసమని దేశ ప్రధాని ఆస్ట్రాజెనికా లాబొరేటరీని బుధవారం సంధర్శించారు ప్రస్తుతం వాక్సిన్ పరిశోధనలు మూడవ దశలో వున్నాయి ఈ వాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల డోసుల కోసం ఒప్పందాలు జరిగాయని తెలుస్తుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *