15 ఏండ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం|25 కత్తిపోట్లు పొడిచి చంపిన మహిళ.

Spread the love

అఘాయిత్యానికి పాల్పడ్డ వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ 15 సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిని బాధితురాలు అపరకాళిగా మారి నరికి చంపింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 200 కిలో మీటర్ల దూరంలో నివాసం ఉండే ఓ మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లికి ముందు 2005లో ఓ ఆగంతకుడు చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ దుశ్చర్యను ఆ కిరాతకుడు వీడియో తీశాడు. 

అప్పటి నుంచి ఆ వీడియోను బయట పెడతానంటూ బ్లాక్మెయిల్‌కు పాల్పడుతూ అత్యాచారానికి ఆ కీచకుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బయటపెడితే కుటుంబం నాశనమవుతుందనే ఉద్దేశంతో మహిళ అతడి దురాగతాలను ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చింది. 

ఈ తరుణంలో మహిళ భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఆ వ్యక్తి మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఇన్నాళ్లూ ఈ కీచక పర్వాన్ని భరించిన మహిళ తిరగబడింది. కత్తితో కసితీరా 25 సార్లు పొడిచి అతడిని నరికి చంపింది. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *