ఆడపిల్ల పుడితే పండుగ! ఎక్కడి సంప్రదాయం ఇది?

Spread the love

ఆడపిల్ల పుట్టగానే ఊరంత పండగ వాతవరణంతో స్వాగతిస్తాం…మైత్రీ ఫౌండేషన్ గుమ్మడిదల సంగారెడ్డి జిల్లా.

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హరిదాస్ పూర్ గ్రామంలో ఆడపిల్ల పుట్టగానే గ్రామంలో పండగ వాతవరణం కల్పించి ఆడపిల్ల పేరు మీద బాలికా సుకన్య సమృద్ధి యోజన పేరుతో అకౌంట్ తీసే సంప్రదాయన్ని అమలు చేయటానికి చాలా గ్రామాలు ముందుకు వస్తున్నాయి.

నేటి నుంచి మండలంలోని పదమూడు గ్రామాల్లో ఆడపిల్ల పుట్టగానే హరిదాస్ పూర్ సంప్రదాయన్ని అమలు చేస్తామని గుమ్మడిదల యందు మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా మండల ప్రజలకోసం అత్యవసర సేవలకోసం మైత్రీ ఫౌండేషన్ వారు అందజేసిన అంబులెన్స్ ను స్థానిక నాయకుల చేతులమీదుగా ప్రారంభించారు.తరువాత మండలంలోని వివిధ రంగాల యందు సేవలందించిన 200 మంది మహిళలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, జోగిపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శంకర్ బాబు, తహశిల్దార్, స్థానిక యస్ఐ, సదాశివపేటకు చెందిన స్వచ్ఛంద సమాజ సేవకుడు అంజాద్ మరియు మండల స్థాయి గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *