కాంగ్రెస్…రేసులో వుందా!?

Spread the love

సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 2014 సంవత్సరం నుంచి అధికారానికి దూరమైన ఈ పార్టీ.. ప్రస్తుతం ఏ ఒక్క రాష్ట్రంలోనూ తన పట్టును నిలుపుకోలేకపోతోంది. ఇందుకు తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ముఖ్యంగా, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ అడుగు పెట్టిన ప్ర‌తి చోటా ఆ పార్టీ ఎలాంటి దుస్థితి అనుభ‌విస్తుందో కూడా ఈ ఎన్నిక‌లు క‌ళ్ల‌కు క‌ట్టాయి.రాహుల్ ప్ర‌చారం చేసిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. ఇక మూడో ఫ్రంట్ అయితే పోటీ చేసిన వాటిలో 85 శాతం స్థానాల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.మూడో ఫ్రంట్ నుంచి పోటీ చేసిన వాళ్ల‌లో మొత్తం 292 స్థానాల‌కుగాను కేవ‌లం 42 మంది మాత్ర‌మే డిపాజిట్లు ద‌క్కించుకున్నార‌ని ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే ఈ విషయం తెలుస్తుంది.మొత్తం ఓట్ల‌లో ఓ అభ్య‌ర్థి క‌నీసం 16.5 శాతం ఓట్లు పొంద‌క‌పోతే ఆ వ్య‌క్తి తాను చెల్లించిన‌ డిపాజిట్ కోల్పోతారు. ద‌శాబ్దాల పాటు బెంగాల్‌ను ఏలిన లెఫ్ట్‌తోపాటు కాంగ్రెస్ కూడా క‌నీసం ఒక్క స్థానాన్ని ద‌క్కించుకోలేక‌పోయాయి. ఇండియ‌న్ సెక్యుల‌ర్ ఫ్రంట్ మాత్రం ఒక్క‌దాంట్లో గెలిచింది.కాంగ్రెస్‌కు ఇంకా జీర్ణించుకోలేని విష‌యం ఏమిటంటే.. త‌మ పార్టీ నేత‌, యువ‌రాజు రాహుల్‌గాంధీ ప్ర‌చారం నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ, గోలక్ పూర్ స్థానాలు రెండింట్లోనూ ఆ పార్టీకి డిపాజిట్లు ద‌క్క‌లేదు. విచిత్ర‌మేమిటంటే న‌క్స‌ల్బ‌రీ స్థానం ప‌దేళ్లుగా కాంగ్రెస్ ద‌గ్గ‌రే ఉంది. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్ మాలాక‌ర్ మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఆయ‌న‌కు కేవ‌లం 9 శాతం ఓట్లు వ‌చ్చాయి.గోల్పోఖ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థి కూడా 12 శాతం ఓట్ల‌తో మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ 90 స్థానాల్లో డిపాజిట్లు ద‌క్కించుకున్నాయి. ఇదే పరిస్థితి ఫలితాలు వెలువడిన మిగిలిన రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. కొంత గుడ్డిలో మెల్లగా తమిళనాడులో ఆ పరిస్థితి ఫర్వాలేదు కారణం బలమైన డీఎంకే వంటి మిత్రపక్షం ఉండటం కలిసివస్తుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *