జీవితం – ఒక మిశ్రమం

Spread the love

ఈ చిత్రం ద్వారా చిత్రకారుడు – “జీవితం రెండు వేర్వేరు కలయికల సంగమం” అని తెలియజేయాలనుకున్నాడు.

      ప్రతీ మనిషి జీవితంలోనూ చీకటి, వెలుగు, ఆనందం, దుఃఖం, మంచి, చెడు, గెలుపు మరియు ఓటములు ఉంటాయి. జీవితాన్ని చీకటి కమ్మేసిందని కృంగిపోయే ప్రతి ఒక్కరికీ ‘రాబోయే రోజుల్లో వెలుగు ప్రకాశిస్తుంది’ అనే ఒక చక్కటి అంతర్లీన సందేశాన్ని ఈ చిత్రం మనకు అందిస్తున్నది.

      జీవితంలో ఒడిదొడుకులు అనేవి సహజం. మన భారతీయ సమాజంలోని చాలా మంది ఈ సహజమైన అంశాన్ని అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉండడం చాలా బాధాకరం. రేపటి రోజున మంచి స్థానంలో ఉంటాము అనే ఆశాభావ ధోరణి నేటి మన సమాజంలో కరువైంది. ఇది మన దేశ భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం.

       కొన్ని వందల సార్లు ప్రయత్నించి చివరికి సఫలుడైన థామస్ అల్వా ఎడిసన్  ఆదిలోనే ఆశలను వదులుకొని తన ప్రయత్నాన్ని విరమించుకొని ఉంటే నేడు మనం ఈ విద్యుద్దీపాల కాంతులలో కూర్చునేవాళ్ళం కాదేమో…!! ఓటములను, బాధలను,  ఆసహనాలను, అవమానాలను సహించి రేపటి రోజు కోసం ఆశాభావంతో ఎదురు చూసినప్పుడే మన ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎదురీదే వాడినే ఈ లోకం వరిస్తుంది అనేది ఈ చిత్రం మనకిచ్చే సందేశం.


Spread the love

2 Replies to “జీవితం – ఒక మిశ్రమం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *