కీళ్ల‌నొప్పుల‌తో బాధ‌ప‌డేవారికో శుభ‌వార్త‌.. ఇంట్లోనే మందు రెడీ!

Spread the love

వ‌య‌సు మీద ప‌డ‌డంతో ముందుగా వ‌చ్చే నొప్పులు కీళ్ల‌నొప్పులే. కూర్చోవాల‌న్నా, లేవాల‌న్నా మోకాళ్ల నొప్పుల‌తో వృద్దులు చాలా బాధ‌ప‌డుతుంటారు. ఈ బాధ నుంచి విముక్తి పొందేందుకు తిర‌గ‌ని హాస్పిట‌ల్ ఉండ‌దు. అంతేకాదు మోకాళ్ల నొప్పులు చూపించుకునేందుకు బ‌స్సులో ప్ర‌యాణం చేస్తే బోన‌స్‌గా న‌డుం నొప్పులు కూడా వ‌స్తాయి. ఈ నొప్పుల‌తో ఏ ప‌ని చేయాల‌న్నా క‌ష్ట‌మే. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ వృద్దుల‌కే కాదు. ఇప్పుడు వ‌య‌సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. అందుక‌ని హాస్పిట‌ల్ చుట్టూ తిరి‌గి మ‌రింత నొప్పికి గురి కాకుండా ఇంట్లోనే మందు త‌యారు చేసుకొని తాగితే ఎలాంటి బాధ ఉండ‌దు. మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో ఎంచెక్కా ఆడుకోవ‌చ్చు. మ‌రి అదెలాగే తెలుసుకుందాం..!

మందుకు కావాల్సిన ప‌దార్థాలు :

మెంతులు

న‌ల్ల మిరియాలు

జీల‌క‌ర్ర‌

త‌యారీ :

వీటికి కొల‌త‌లు అనేం లేదు. కొంచెం కొంచెం తీసుకుంటే స‌రిపోతుంది. అయితే ముందుగా మెంతులు, న‌ల్ల మిరియాలు, జీల‌క‌ర్ర‌ను విడివిడిగా మిక్సీ ప‌ట్టించి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. వీట‌న్నింటినీ విడివిడిగానే జ‌ల్లెడ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూడు పొడుల‌ను బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని గాలి త‌గ‌ల‌ని కంటైన‌ర్‌లో నిల్వ చేసుకోవాలి. ఎయిర్‌టైట్ కంటైన‌ర్‌లో స్టోర్ చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులే వ‌స్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకొని, అందులో సగం స్పూన్‌ మిశ్రమం వేసి బాగా కలుపాలి. ఇది కాస్త చేదుగా ఉంటుంది కాబ‌ట్టి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఈ మందును ప్ర‌తిరోజూ తాగ‌డం వ‌ల్ల కీళ్ల‌నొప్పులు నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. స‌రిగ్గా రెండు నెల‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా పాటిస్తే యంగ్‌స్ట‌ర్స్‌లా గంతులేయొచ్చు. ఈ మందు వ‌ల్ల మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డమే కాకుండా, శ‌రీరానికి బ‌లాన్నిస్తుంది. టీ క‌ల్చ‌ర్ మొబైల్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌
టీ క‌ల్చ‌ర్‌(T – CULTURE) మొబైల్ యాప్‌ను రాష్ర్ట ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌శాఖ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ నేడు ఆవిష్క‌రించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో ఈ ప్ర‌త్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కె.ఎస్‌. శ్రీనివాస రాజుతో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కళల ఖజానా అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారన్నారు. వారందరికి సంభందించిన స‌మాచారాన్ని ఆన్ లైన్ లో అదేవిధంగా మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు తెలియ‌జేయ‌నున్న‌ట్లు చెప్పారు. అదేవిధంగా కళాకారులను ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *