నేడు కూడా 10 వేలకు పైగా కేసులు…తగ్గేది లేదా?

Spread the love

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ నందు విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ నందు వరుసగా పది వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటలుగా ఏపీలో కొత్తగా 10,080  కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 97 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 1,939 మంది మృతి చెందారు.కేసులను జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో 1,353, తూర్పుగోదావరిలో 1,310, అనంతపురంలో 976, చిత్తూరు జిల్లాలో 963, నెల్లూరులో 878, విశాఖపట్నం 998, గుంటూరు 601, కడప 525, పశ్చిమ గోదావరిలో 681, విజయనగరంలో 450, శ్రీకాకుళంలో 442, కృష్ణాలో 391, ప్రకాశంలో 512 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 62,123 టెస్టులు చేయగా 10,080 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, 9,151 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆక్టివ్ కేసులు 85,486 కాగా కోలుకుని డిశ్చార్జ్ అయినా వారి సంఖ్య 1,29,615. మొత్తం కరోనా కేసుల సంఖ్యా 2,17,040 కు చేరుకుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *