కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితమే అదనంగా లక్ష ఎకరాల సాగు : మంత్రి శ్రీ హరీష్ రావు గారు

Spread the love

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితమే
అదనంగా లక్ష ఎకరాల సాగు : మంత్రి శ్రీ హరీష్ రావు గారు

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితమే
జిల్లాలో అదనంగా లక్ష ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అని మంత్రి శ్రీ హరీష్ రావు గారు పేర్కొన్నారు.

శనివారం 74 వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకం ను
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఆవిష్కరించారు.

వేడుకల్లో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వేలే టి రోజా రాధ కృష్ణ శర్మ , ఎంపి శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి, ఎమ్మెల్సీ లు ఫారుక్ హుస్సేన్ , రఘోత్త o రెడ్డి, అదనపు కలెక్టర్ లు శ్రీ ఎస్ పద్మాకర్, శ్రీ శ్రీ ముజమ్మీల్ ఖాన్, .
శిక్షణ కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి శ్రీ హరీష్ రావు గారు పాల్గొని జిల్లా లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమా లు, వాటి ప్రగతిని వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ముందంజలో నిలిచిందన్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు బృంద కృషి తో జిల్లా అద్భుత ప్రగతి సాధించిందన్నారు.
ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక, గుణాత్మక మార్పులు సాధించిందన్నారు.

గత వానాకాలంలో ఒక లక్షా 20 వేల ఎకరాలలో వరిని జిల్లాలో సాగు చేస్తే ప్రస్తుత వానాకాలంలో గతంలో సాగు చేసిన వరి పంటకు అదనంగా లక్ష ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారన్నారు.
భూగర్భ జల మట్టం పెరగడం, నీటి లభ్యత పెరగడం ఇందుకు కారణం అని మంత్రి తెలిపారు.
అనేక సాగు నీటి ప్రాజెక్టు లతో రిజర్వాయర్ ల ఖిల్లాగా సిద్దిపేట అవతరించి నందునే ఇది సాధ్య పడిందన్నారు.
రైతుల సంక్షేమం, ప్రయోజనాన్ని కాంక్షించి ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు ను చేపట్టిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతు బంధు క్రింద వానాకాలం పంట పెట్టుబడి కోసం 302 కోట్ల రూపాయల ను రైతుల ఖాతాలలో జమ చేసిందన్నారు. రైతు భీమా పధకం లో భాగంగా అకాల మరణం పొందిన 581 మంది రైతులు కు 29 కోట్ల 5 లక్షల రూపాయలను పరిహారంగా అందుంచిందన్నా రు.

సాగు విస్తీర్ణం పెరగడం, పంట దిగుబడులను దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ల ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ల ఏర్పాటు త్వరలో ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంద న్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం కు 30 వేల మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోడౌన్ లను నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. కోల్డ్ స్టోరేజ్ లను సైతం ఏర్పాటు చేయనుందన్నారు. కాళేశ్వరం జలాలతో జిల్లా కోనసీమ ను తలపించ నుందన్నారు. రైతులు 3 పంటలను సాగు కు కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నా రు. వ్యవసాయ యాంత్రీకరణ కు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షాలు విరివిగా కురుస్తున్న దృష్ట్యా రైతులు ఎకరానికి మోతాదుకు మించి యూరియా వినియోగిస్తూ న్నారని అన్నారు. మోతాదు కు మించి ఎరువులు వాడకం సరికాదన్నారు. దీని వల్ల అనవసర పెట్టుబడి వ్యయం పెరుగుతుందన్నారు. యసంగి పంట కోసం కొంతమంది యూరియా ను నిల్వ చేస్తున్నారని..

ఇది సరి కాదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎండాకాలంలో ప్రాజెక్టు లు, చెరువులు నింపడం ద్వారా ….
ప్రస్తుతం కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకే జిల్లాలోని అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయని మంత్రి అన్నారు.జిల్లాలో 3484 చెరువులు,చెక్ డ్యాం లకు గానూ ఇప్పటి వరకూ 1600 చెరువులు, చెక్ డ్యాం లు పూర్తిగా నిందయన్నారు.
ఈ రోజు సాయంత్రము కు మరిన్ని నిందే అవకాశం ఉందన్నారు. సింగ రాయ సాగర్, గండి మహా సముద్రం, శనిగర o ప్రాజెక్టు లు సైతం నిందయాన్నారు.

అనంతగిరి , రంగ నాయక సాగర్ ప్రాజెక్ట్ ల తో పాటు ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు.
డిస్ట్రిబ్యూ టెడ్, మైనర్ కాలువల త్రవ్వెందుకు రైతులు సహకరిస్తే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుందనీ మంత్రి తెలిపారు.

రెండు పడక గదుల గృహ నిర్మాణం లో జిల్లా ముందంజలో ఉందని మంత్రి తెలిపారు.
జిల్లాకు కేటాయించిన 12820 ఇండ్లలో 8370 ఇండ్లు నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామన్నారు.
కరోనా వల్ల పంపిణీ చేయడంలో కొంత అలస్యం జరిగిందన్నారు. కోవిడ్ తగ్గగానే…
ప్రస్తుత సంవత్స రాంతంలోగా ఇండ్లను నీరు పేదలకు పంపిణీ పూర్తి చేస్తామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం TS B pass ఇండ్ల నిర్మాణం కు అత్యంత వేగంగా ఇండ్ల నిర్మాణం కు కేవలం 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తుందన్నారు.
75 గజాల లోపు పేదలు నిర్మించుకునే ఇండ్లకు రూ.1 కే అనుమతులు మంజూరు చేస్తుందన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *