వేషాలు మారుస్తున్న కరోనా…ఇప్పటికి 73

Spread the love

కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని కబళించి వేస్తుంటే మన దేశంలో వైరస్ రోజు రోజుకి తనం జులుం విధులిస్తూ ప్రతి రోజుకి వెయ్యికి పైగా మరణాలు సంభవించడానికి కారణమవుతుంది. దీనితో వైరస్ పై ఒడిస్సా శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో వాతావరణ అనుకూలతలు, ప్రతికూలతల వలన కరోనా మహమ్మారి 73 రకాలుగా మార్పు చెందినట్లు గుర్తించారు. దాదాపుగా 1500 పైగా కరోనా నమూనాలపై రీసెర్చ్ చేసిన తరువాత ఈ విషయాలను దృవికరించారు. కరోనా ప్రధాన వైరస్ నుంచి 73 రకాల ఉత్పరివర్తనలు ఏర్పడ్డాయని, కరోనా బలహీనత గురించి తెలుసుకుంటే చికిత్స ఎంతో సులభతరమని కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనడం ఏమంత కష్టమైనది కాదని తెలియచేసారు. ఒడిస్సా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం సీఎస్ఐఆర్, ఐజీఐబీ, న్యూఢిల్లీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్ కు చెందిన ఎస్ యూఎం పరిశోధకులతో కలిసి పనిచేశారు. ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన జయశంకర్ ఈ వివరాలను తెలియచేశారు. వైరస్ ఇన్ని రకాలుగా మార్పు చెందటంతోనే కొంతమందికి వైరస్ సోకినా రెండు మూడు రోజులులలో తగ్గుతుంటే మరికొంతమందికి బాగా సీరియస్ కావడం జరుగుతుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *