అప్పుడు విద్యార్థులకు బుద్దులు నేర్పాడు…ఇప్పుడు దొంగల ముఠా నాయకుడయ్యాడు.

Spread the love

ఒకప్పుడు పిల్లలకు విద్యా బుద్దులలో శిక్షణ ఇచ్చేవాడు…మరి ఇప్పుడు దొంగల ముఠా తయారు చేసి ఎలా దొంగతనం చేయాలో శిక్షణ ఇస్తూ ముఠా నాయకుడు అయ్యాడు. వివరాలలోకి వస్తే… శ్రీనివాస్ ఓ ప్రైవేట్ పాఠశాల్లో ఇంగ్లీష్ బోధించేవాడు. ఎన్నాళ్లు పాఠాలు చెప్పినా, జీతం తప్ప పెద్దగా ప్రయోజనం లేదు, ఇలా అయితే సంపన్నుడు కావాలన్న కల నెరవేరదు? అనుకుని ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు. చోరీ కేసులో జైలుకెళ్లిన శ్రీనివాస్ అక్కడో మాస్టర్ ప్లాన్ వేశాడు. జైల్లో పరిచయమైన ఖైదీలతో గ్యాంగును ఏర్పాటు చేసి వాళ్లతో దొంగతనాలు చేయించాలనేది అతని స్కెచ్. శ్రీనివాస్ బెయిల్ పైన బయటకు వచ్చిన తరువాత జైల్లో ఉన్న తోటి ఖైదీలను బెయిళ్లపై బయటికి తెచ్చేందుకు వారికి అవసరమైన న్యాయవాదిని ఏర్పాటు చేసి, కోర్టుకు ష్యూరిటీలను ఇచ్చి విడుదల చేయించేవాడు. అలా జైళ్ల నుంచి విడుదల ఖైదీల నుంచి లాయర్ ఫీజు డబ్బును వసూలు చేసుకోవడానికి దొంగతనాలు చేయించేవాడు. బయటకు వచ్చిన ఖైదీలకు రూమ్‌లు, ఇళ్లను అద్దెలకు ఇప్పించాక చోరీకి అవసరమైన స్క్రూ డ్రైవర్లు, ఇనుప రాడ్లను ఇతర పరికరాలిచ్చేవాడు. చోరీ చేసొచ్చాక బంగారు, వెండి నగలను అమ్మి పర్సంటేజ్లను తీసుకునేవాడు శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పటివరకు దాదాపు యాబై వరకు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఈ టీచర్ శ్రీనివాస్.


Spread the love

One Reply to “అప్పుడు విద్యార్థులకు బుద్దులు నేర్పాడు…ఇప్పుడు దొంగల ముఠా నాయకుడయ్యాడు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *