కరోనా@99…విజయం!

Spread the love

కరోనా సెకండ్ వేవ్ ప్రజానికాన్ని వణికిస్తోంది.మహమ్మారి ప్రభావంతో వయసుతో తారతమ్యం లేకుండా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో 99 ఏళ్ల వృద్ధురాలు కోవిడ్ నుండి కోలుకుని ఇతరులకు మానసిక స్థైర్యాన్ని నింపుతున్నారు. విజయవాడ పటమటకు చెందిన గూడపాటి సుబ్రమణ్యం సతీమణి గూడపాటి లక్ష్మీ ఈశ్వరమ్మ కరోనా కరోనా బారిన పడ్డారు. ఈమె వయసు 99 సంవత్సరాలు. మంగళగిరి మండలం చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కోవిడ్‌కు చికిత్స అందించారు. పది రోజుల చికిత్స అనంతరం శనివారం సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యుల సూచన మేరకు మందులు వాడి పౌష్టికాహారం తీసుకోవటం వల్ల తాను కోలుకున్నట్లు చెప్పారు. కోవిడ్ సోకిన వారు ధైర్యాన్ని కోల్పోకుండా సమయానికి మెడిసిన్ వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే వైరస్‌ను జయించవచ్చునని పేర్కొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *