తమిళనాట…సినీ గ్లామర్ పనిచేయలేదా..!!

Spread the love

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సినీ గ్లామర్ ఏమాత్రం పనిచేయలేదు. ఎన్నో ఆశలతో ఎన్నికల గోదాలోకి దిగిన అనేక మంది సినీ నటులు చిత్తుగా ఓడిపోయారు. ఇలాంటి వారిలో విశ్వనటుడు కమల్ హాసన్, సినీ నటీమణులు ఖుష్బూ, శ్రీప్రియ, దర్శకుడు సీమాన్, హాస్య నటుడు మయిల్ స్వామి, నటుడు మన్సూర్ అలీఖాన్, సినీ గేయ రచయిత స్నేహనన్‌లు ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ హీరో ఉదయనిధి స్టాలిన్, నిర్మాత అంబోత్ కుమార్‌లు మాత్రమే గెలుపును సొంతం చేసుకున్నారు.

ఏప్రిల్ 6వ తేదీన ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా…మే 2వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కోయంబత్తూరు దక్షిణం స్థానం నుంచి బరిలోకి దిగిన కమల్ హాసన్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన వానతి శ్రీనివాసన్ చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *